Header Banner

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

  Fri May 16, 2025 10:56        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్‌ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియతో పాటుగా ఆ దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతోంది. ఈ క్రమంలో రేషన్ కార్డుల దరఖాస్తుల పురోగతిని ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

'https///vswsonline.ap.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్‌ వస్తుంది. అందులో కుడి వైపున పైన సర్వీస్‌ రిక్వెస్ట్‌ స్టేటస్‌ చెక్‌ అనే సెర్చ్‌ గడియ ఉంటుంది. అక్కడ అందులో రేషన్‌ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.. తర్వాత ఓ కోడ్‌ వస్తుంది. ఆ వివరాలు అందులో పొందుపరిస్తే.. రేషన్‌ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో తెలిసిపోతుంది. ప్రక్రియ ఎన్ని రోజుల్లోపు పూర్తవుతుంది వంటి వివరాలు కనిపిస్తాయి' అని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామని..రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాల శాఖ సేవలు అందుబాటులో వచ్చిందన్నారు.

ఒక సంవత్సరం లోపు పిల్లలకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన అన్నారు.. అంటే వారికి ఈకేవైసీ అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 95 శాతం కేవైసీ పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డు ఇస్తారని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారని తెలిపారు.పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. లింగమార్పిడి చేయించుకున్న వారికి కూడా మొదటిసారిగా రేషన్ కార్డులు అందజేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామన్నారు మంత్రి. మరోవైపు రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వాట్సాప్‌లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయన్నారు.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APRationCard #SmartRationCard #APGovtServices #Ekyc #RationCardUpdate #OnlineStatusCheck